క్యాస్టు ఫీలింగు ఉన్నట్టా, లేనట్టా?

August 25, 2015 | 02:22 PM | 3 Views
ప్రింట్ కామెంట్
CPI_narayana_KCR_ramojirao_filmcity_niharonline

ఎస్ సీ అంటే సేం క్యాస్ట్. క్యాస్టు ఫీలింగు, ఇలాంటి పడికట్టు పదాలు సాటి కులస్థులపై పక్షపాతం చూపి అడ్డగోలుగా సాయం చేసేటప్పుడు వాడుకలో పడిచచ్చేయి. సూటిగా కులం అడగటానికి నాగరికత అడ్డం వచ్చినప్పుడు మీ ఇంటి పేరేమి అని గడుసుగా వాకబు చేస్తుంటారు. ఈ రంధి అంతా హిందు మతంలో ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థ వల్లనే. అంతకీ శాస్త్రి, శర్మ, పంతులు, రెడ్డి, చౌదరి, నాయుడు, రాజులాంటి తోకలు ఉన్నప్పటికీ గందరగోళం పేర్లు ఉండనే ఉంటాయి. పంతులుగారైతే కేండిడేట్ భుజం మీద చెయ్యివేసి ఒత్తితే జంధ్యం తగిలితే కన్ఫర్ము చేసుకునే విధానం ఒకటి ఉందని జోకు. మరి క్షత్రియుడికీ, విశ్వబ్రహ్మణుడికీ కూడా జంధ్యం ఉన్నప్పుడు ఏంటీ పరిస్థితి? ఇవన్నీ ఎవడి కులపోడికి వాడు సాయపడటం తప్పో ఒప్పో మరి తేలని సమస్య అయినా సాటి మనిషికి సాయమందించడమనే సుగుణం నల్ల పూస అయిపోతున్న దిక్కుమాలిన రోజులు కదా సాయిరామ్!

                            ఇంతకీ వర్తమానంలోకి వస్తే, కేసీఆర్ అఘటన ఘటనా సమర్థుడిగా రుజువు చేసుకుని రాష్ట్రం సాధించిన తరుణంలో దొరవారి గౌరవం ఇనుమడించింది. న్యూస్ పేపర్ బేరన్, పేపర్ మొఘల్ చెరకూరి రామోజీరావు సృష్టించిన భూతల స్వర్గాన్ని దర్శించి కేసీఆర్ సంతోష మనస్కులయ్యారు. ఓంసిటీ నిర్మాణ వివరాలు ఆకళింపు చేసుకుని దివ్యమైన ఆలోచన అని రామోజీని అభినందించేరు. ఇంతటి సుహృద్భావ వాతావరణం వెల్లవిరిసే శుభసమయంలో శుక్రాచార్యుడి మొఖంపెట్టే వక్రభాష్యానికి ఒడగట్టేడు కంకణాల నారాయణ అనే చివరి చౌదరి లేని కమ్యూనిస్టు. లక్షనాగళ్లతో దున్నిస్తానని కేసీఆర్ అన్నాడని అందుకే కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు, ఇంకా దున్నించడే అని పిల్లశాపనార్థాలు పెడుతున్నాడు. ఇక్కడ రామోజీ, నారాయణా ఒకే తాను ముక్కలే. కలువలు వికసించాలె, కుంటలు నిండాలె, చంద్రుడు ప్రకాశించాలె, అని ప్రజలందరూ శుభాశీస్సులు అందిస్తుంటే ఈ నారాయణ కేసీఆర్ ని ఆడిపోసుకుంటూ పార్టీని బలపరచే ప్రయత్నంలో ఒక సమిధలా, ఒక సైనికునిలా అలా ముందుకు పోతున్నాడు. రామోజీని మాత్రం డైరక్టుగా ఏమీ అనలేదు! సర్వే కులా సుఖినోభవంతు

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ