సీపీఐ నారాయణ మరోసారి నోటికి పని చెప్పారు. తోటి నేతలను లెక్క చేయకుండా నోటికొచ్చినొట్లు తిట్టేయటం ఆయనకు పరిపాటే. తాజాగా పవన్ కళ్యాణ్ ను రాజకీయ శిఖండిగా అభివర్ణించిన ఆయన ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ప్రశ్నలు గుప్పించారు.
గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దివంగత వైఎస్ ఆకర్ష్ కింద పార్టీలోకి ఆహ్వానించినప్పుడు కేసీఆర్ గగ్గోలు పెట్టారన్నారు. మరిప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా వారి పార్టీలోకి తీసుకుంటారని నిలదీశారు. ఇలాంటి రాజకీయ వ్యభిచారులపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు పెట్టేంతవరకు వ్యభిచారం చేసే వేశ్యలపై కూడా కేసులు పెట్టకూడదని నారాయణ అన్నారు.
అమెరికాలో తెలుగు విద్యార్థులను అవమానించడం బాధాకరమని నారాయణ అన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే దానికి అమెరికా ఎంబసీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక కాపుల రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ ఆ హామీ ఇచ్చిన వారి చొక్కాలు విప్పి ఊరేగిస్తే తాము అండగా ఉంటామని చెప్పాడు.