ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి అదేపని చేశారు. ఈసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కట్టుకున్న పెళ్లాన్ని ఏలుకోలేని వ్యక్తి, దేశాన్ని ఏలగలుగుతాడా? అంటూ ఫైరయ్యాడు. తన భర్త పిలిస్తే ఆయన దగ్గరకు వెళ్తానని మోదీ భార్య చెబుతున్నప్పటికీ ఆయన మాత్రం పట్టించుకోవటం లేదని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల సీఎం కుమారులను కూడా ఆయన టార్గెట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పిల్లలు క్లాసికల్ బెగ్గర్ లా అమెరికాలో తిరుగుతున్నారని, కేటీఆర్, లోకేశ్ లు చప్రాసీలుగా కూడా పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.