రైతు భరోసా యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ కు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గురువారం రాత్రే ఆయన అదిలాబాద్ కు చేరుకున్నాడని కూడా విదితమే. అయితే ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్ ద్వారా నిర్మల్ చేరుకోవాల్సిన ఆయన చివరి నిమిషంలో రూట్ మార్చకున్నాడు. నిర్మల్ కు సమీపంలోని నాందేడ్ లో విమానం దిగి అక్కడి ద్వారా నిర్మల్ చేరారు. అయితే ముందు ప్లాన్ ప్రకారం కాంగ్ నేతలంతా శంషాబాద్ నుంచి నిర్మల్ దాకా సుమారు రూ.2 కోట్లతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారట. చివరి నిమిషంలో వారి ‘ఆర్భాటం’ గురించి తెలుసుకున్న రాహుల్ అసహనంతోపాటు ఒకింత ఆగ్రహానికి గురై తన రూట్ మార్చుకుని అలా వచ్చారట. ఇక అధినేతలంతా తమ హడావుడి అంతా వ్యర్థం అయిందని తెగ ఫీలయిపోతున్నారని తెలుస్తోంది. ఇక్కడ రాహుల్ రూట్ చేంజ్ చేసుకున్న విషయం కీలక నేతలకు కూడా తెలియకపోవటం కొసమెరుపు.