కమ్యూనిస్టు నేత కితకితలు: ప్రధాని పేరుకు కొత్త భాష్యం

August 08, 2015 | 05:01 PM | 3 Views
ప్రింట్ కామెంట్
CPI_ramakrishna_on_PM_modi_ap_special_status_niharonline

దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో ఆయన పేరు మారుమోగిపోతుంది. గడచిన సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి నేటి వరకు దేశ విదేశాల్లో నమో అన్న నామం తారక మంత్రంలా మారిపోయింది. బీజేపీ నేతలు కూడా నమో పేరిట ఆయనను ముద్దుగా పిలుచుకోవడంగా మారిపోయింది. అయితే ఆ నమో మంత్రానికి సరికొత్త పేరు చెబుతున్నారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడట. ఎన్నికల ముందు వాగ్ధానం చేసి, ఇప్పుడు ప్రత్యేక హోదాపై కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారట. పరిశ్రమలు రావాలన్న, యువతకు ఉపాధి కావాలన్న ప్రత్యేక హోదా, ప్యాకేజీలు తప్పనిసరి అని ఆయన అంటున్నారు. అలాంటి విషయాల్లో జాప్యం పనికి రాదని ఆయన అంటున్నారు. తక్షణమే ప్రధాని ఈ విషయమై ఓ ప్రకటన చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. సాధారణంగా సీపీఐ లో సీనియర్ నేత నారాయణ నుంచి ఇలాంటి పలుకులు వినిపిస్తాయి. కానీ, ఇఫ్పుడు రామకృష్ణ నుంచి ఇలాంటి కామెంట్లు రావటం విశేషం. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ