మోదీ అండ్ కో ని ఏస్కున్న కామ్రేడ్ సోదరులు

May 14, 2016 | 05:45 PM | 5 Views
ప్రింట్ కామెంట్
CPI slams PMs silence on AP special status

ఓవైపు కేంద్రంలో బీజేపీ నేతలు ప్రత్యేకహోదా లేదని చెబుతుంటే ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఇంకా మోసం చేస్తున్నారని సీపీఐ మండిపడింది. ఏపీ ప్రత్యేక రాష్ట్రం అని అంటున్నారు అసలు ప్రత్యేక రాష్ట్రం అంటే ఏంటని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేకం చేశారని, ఇంకా ప్రత్యేకం ఏంటని అన్నారు. అలాగే బీజేపీ నేతలు ఏపీకి చాలా చేశాం, చాలా ఇచ్చామంటున్నారు...మీ అబ్బసొత్తేమన్నా ఇచ్చారా? అని ఆయన నిలదీశారు. ప్రజాధనాన్ని ప్రజలకు ఇచ్చేందుకు డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాము రాష్ట్రానికి అడుగుతోంది భిక్ష కాదని ఆయన గుర్తుచేశారు. తమకు కావాల్సింది హక్కు అని, దానిని తాము అడుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా తేవాల్సిందేనని తెలిపిన ఆయన, హోదా లేని పక్షంలో మోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

                            ఇక విభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు నిలువునా మోసం చేసిందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ కేడీలా ఏపీ ప్రజలను మోసం చేశారని అన్నారు. తిరుపతిలో ప్రత్యేకహోదా ఇస్తామని, ఏపీకి హోదా తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని చెప్పిన విషయం నిజం కాదా? అని ఆయన నిలదీశారు. ఇప్పుడు రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అని అంటున్నారని, దానికి అర్థం ఏంటని ఆయన అడిగారు. ప్రజల్లోకి వెళ్తాము, బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సవాలు చేశారు. బీజేపీ నేతలు మీడియాకు చెప్పిన మాటలను నేరుగా ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షా వచ్చి ప్రజలతో నేరుగా మాట్లాడినా సంతోషమేనని ఆయన అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ