కమ్యూనిస్టు నేత కామెంట్: కుక్కలు కూడా యోగాసనాలు వేస్తాయి!!

June 22, 2015 | 12:59 PM | 0 Views
ప్రింట్ కామెంట్
Sitaram_Yechury_comments_on_yoga_day_niharonline

ప్రధాని చోరవతో ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 170 దేశాలు ఆదివారం (జూన్ 21) యోగా దినోత్సవాన్ని నిర్వహించాయి. ఎంతలా అంటే స్వయానా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి తన భార్యతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాదు,  యోగాసనాలు వేశారు కూడా. ఇక మన దేశానికొచ్చేసరికి ఎక్కడ చూసినా యోగా సందడే కనిపించింది. ప్రధాని మోదీ సైతం 21 యోగ ముద్రలు వేసి అందరినీ ఉత్సహా పరిచారు. అయితే ఈ తతంగం అంతా ఓ కమ్యూనిస్ట్ నేతకు నచ్చలేదట. భారీ సంఖ్యలో జనాలను చేర్చటం కేవలం నియంతలు మాత్రమే చేసే పని అంటున్నారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. రాజ్ పథ్ లో  పెద్ద ఎత్తున గుమిగూడటం నిషేధం. అయినప్పటికీ వేల సంఖ్యలో జనాలను సమీకరించారని అసహానం వ్యక్తంచేశారు. ఆ విషయానికోస్తే అదేం గొప్ప విషయం కాదని, కుక్కలు కూడా యోగాసనాలు వేస్తాయని వ్యాఖ్యానించారు. కాళ్లు, చేతులు ఆడిస్తూ, సుదీర్ఘంగా శ్వాస తీసుకోవటమే యోగా అయితే అందుకు సంబంధించిన చేష్టలను కుక్కలో కూడా చూడవచ్చని ఆయన అన్నారు. కేవలం హిందుత్వ అజెండా అమలు చేసేందుకు మోదీ ఈ ప్రచారాన్ని వాడుకున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకతీతంగా గర్వకారణంగా జరుపుకున్న  ఈ యోగా దివాస్ గురించి ఓ జాతీయ నేత ఇలా వ్యాఖ్యానించటం ఎంతైనా కాస్త ఇబ్బందే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ