లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల విషయంలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. అధికారుల పోస్టింగ్, బదలీలు, తొలగింపు వంటి విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ కు విశిష్ట అధికారాలు ఉంటాయని, ఈ విషయంలో ముందస్తు సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అంతేకాదు ఈమేరకు లెఫ్టినెంట్ అధికారాలకు సంబంధించిన అధికారాలను తెలుపుతూ ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఉద్యోగుల నియమాకాలు, శాంతి భద్రతలు, భూములు తదితర అంశాల లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకే వస్తాయని స్పష్టంచేసింది. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ వంకతో కేంద్రం తమపై పెత్తనం కొనసాగిస్తుందని కేజ్రీవాల్ గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే.