బొగ్గు కుంభకోణంలో దాసరికి బెయిల్

May 22, 2015 | 11:24 AM | 50 Views
ప్రింట్ కామెంట్
Dasari_narayana_rao_got_bail_in_coal_scam_niharonline

కోల్ స్కాంలో ప్రముఖ దర్శకుడు, మాజీ మంత్రి దాసరి నారాయణ రావుకు కాస్త ఊరట లభించింది. ఈ కేసులో శుక్రవారం ఆయన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు హాజరుకాగా, న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాసరితోపాటు కేసులోని మిగతా నిందితులు కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, మరో 12 మందికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ కింద ఒక్కోక్కరు లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కేసులో విచారణ పూర్తైనందున బెయిల్ ఇచ్చిన కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. అంతేకాదు కేసులో సాక్ష్యులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ