ఏపీ ఉద్యోగులకు నిజంగా పె...ద్ద ఊరట

February 27, 2016 | 12:37 PM | 1 Views
ప్రింట్ కామెంట్
chandra-babu-5days-working-plan-for-AP-employees-niharonline

ఎట్టి పరిస్థితుల్లో ఈ జూన్ నుంచే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ద్వారా పూర్తి స్థాయి పరిపాలనను నిర్వహించాలని భావిస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఆలోగా మొత్తం అన్ని శాఖలను అమరావతికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు లేకపోవడం, నివాస గృహాలకు ఉన్న కొరత దృష్ట్యా ఉద్యోగులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా హైటెక్ పాలనను అమలు చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇప్పటికిప్పుడు అమరావతికి తరలిరావడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పిన అధికారులు వసతుల విషయంలో మాత్రం కాస్త ఆందోళనతోనే ఉన్నారు. దీంతో ఓ సరికొత్త ప్రతిపాదనను సీఎం ముందు వారు ఉంచారు. వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని  ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

అయితే పనిదినాలు తగ్గిపోతున్న క్రమంలో కొన్ని గంటల పాటు అదనపు పనిచేస్తే సరిపోతుందని ఆయన భావిస్తున్నారంట. ఇందుకోసం సదరు అదనపు పనిని ఉద్యోగులు ఇంటి నుంచే చేసేలా ప్రతిపాదించారు. దీనిపై ప్రామాణికత, మార్గదర్శకాలపై కసరత్తు చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెరసి వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. అంటే, ఏపీలో హైటెక్ తరహా పాలన త్వరలోనే అమల్లోకి రానుందన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ