టీఆర్ఎస్ లో ఎర్రబెల్లికి చివరకు మిగిలేది?

February 27, 2016 | 10:35 AM | 4 Views
ప్రింట్ కామెంట్
revanth-reddy-errabelli-dayakar-KCR-watchman-niharonline

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి సైతం రాజీనామా చేసి తెలంగాణలో పార్టీకి పెద్ద దెబ్బ కొడుతూ టీఆర్ఎస్ లో చేరాడు సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎప్పుడైతే టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించాడో అప్పటి నుంచి ఆయనపై విరుచుకుపడటం ప్రారంభించాడు టీటీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. ఎర్రబెల్లి చేసిన ద్రోహం మాములుకాదని ఆయన వాదన. ఈ క్రమంలోనే ఎర్రబెల్లిపై మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు శుక్రవారంతో ముగిసింది. అయితే అధికారపక్షం టీ టీడీపీ అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు యత్నించిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో తమ పార్టీ అభ్యర్థులను హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించింది.

ఈ సందర్భంగా అభ్యర్థులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రలోభాలకు లోను కామని, పార్టీ మారబోమని వారితో ఆయన ప్రమాణం చేయించారు. అక్కడితో ఆగక పార్టీ మారిన ఎర్రబెల్లికి టీఆర్ఎస్ లో దక్కేది వాచ్ మన్ పోస్టేనని ఆయన అన్నారు. ‘‘ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినంక కేసీఆర్ పక్కన నిలబడబోగా, పోయి కూచో పో అని కేసీఆర్ అన్నరంట. దీంతో ఆయనకు మిగిలింది కేసీఆర్ ఫాంహౌజ్ లో వాచ్ మన్ ఉద్యోగమే’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. మాజీ సహచరుడు అని కూడా చూడకుండా మరి ఇంత దారుణంగా మాట్లాడం సబబు కాదేమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ