చరిత్ర సృష్టించబోతున్న చంద్రబాబు

February 19, 2016 | 12:05 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Chandrababu Naidu-roof-top-helipad-AP-secretariat-niharonline

గతేడాది ఇండియా టుడే సర్వేలో  బెస్ట్ సీఎంగా మూడో స్థానంతో సరిపెట్టకున్న చంద్రబాబు మరో అరుదైన ఫీట్ కు సిద్ధమైపోతున్నారు. సాధారణంగా ప్రెసిడెంట్ దగ్గరి నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ ట్రాఫిక్ కష్టాలు చవిచూసినవారే. ఇంటి నుంచి ఎక్కడికైనా బయలుదేరితే ఎక్కడ, ఏ మార్గంలో చిక్కుకుపోతారో తెలియంది కాదు. ముఖ్యంగా వారి ప్రయాణాలు మూలంగా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు తన వల్ల కలగకూడదని భావిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. టెక్నాలజీని ఆయన ఏ రేంజ్ లో వాడుకుంటారో మనకు తెలియందీ కాదు.

                             అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మించతలపెట్టిన సచివాలయం రూఫ్ టాప్ పై హెలిప్యాడ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందిసీఎం ఇంటి నుంచి బయలుదేరితే, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం, ఆపై హెలికాప్టర్ దిగగానే వెంటనే కార్యాలయంలోకి వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఆర్డీయే కమిషనర్ ఎన్ శ్రీకాంత్ వెల్లడించారు. సచివాలయంలో భాగంగా ఆరు భవనాలు వస్తాయని, చంద్రబాబు కార్యాలయం ఉండే ఏ బ్లాక్ పై 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అనువైగా హెలీపాడ్ నిర్మిస్తామని ఆయన వివరించారు. . ఇక సెక్రటేరియట్ పై హెలిపాడ్ ఏర్పాటైతే, ఇండియాలో తన కార్యాలయంపై హెలిపాడ్ ఉన్న ఏకైక సీఎంగా చంద్రబాబునాయుడు కొత్త చరిత్ర సృష్టించనున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ