చంద్రబాబుకు మళ్లీ చుక్కలు కనిపిస్తాయా?

November 04, 2015 | 05:24 PM | 1 Views
ప్రింట్ కామెంట్
chandra-babu-on-govt-staff-shift-to-amaravathi-niharonline

ఎన్నికలకు ముందుగానే సొంత రాజధాని నుంచి పాలన కొనసాగించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు విఘాతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కీలకమైన ఉద్యోగుల నుంచే ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఇప్పుడు గోచరిస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగాలంటే ఎన్నికలోపే రాజధాని కొంతలో కొంతైనా పూర్తిచేయటంతోపాటు కార్యాలయాల తరలింపు చేయాలి. కానీ, అది అనుకున్నంతా సులువు కాదు కదా. దీంతో ఇప్పుడు సీఎంకు, ఉద్యోగులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది.  

అమరావతి శంకుస్థాపన అనంతరం హడావుడిగా ప్రారంభించిన కార్యాలయాల తరలింపునకు ఉద్యోగులే అడ్డుగా మారే పరిస్థితి దాపురిస్తుంది. తరలించటం అంటే కేవలం ఫైళ్లు, టేబుళ్లు, మాత్రమే కాదు కదా. ఉన్నపళంగా ఆస్తులను వదులుకోని వందల కిలోమీటర్లు ఎవరితోనూ అయ్యే పనికాదు కదా. దీనికి తోడు పిల్లల చదువులు, కుటుంబాల పరిస్థితులను కూడా అంచనా వేసుకోవాలి కదా. అంతేకాదు అది అనుకున్నంత త్వరగా అయ్యేది కూడా కాదు.

నిజానికి 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ఉద్యోగులు కూడా ప్రధాన కారణమే. కఠిన వైఖరితో, నిర్ణయాలతో తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులు చిత్తుగా బాబును ఓడించారు. ఇక ఇప్పుడు ఈ నిర్ణయంతో ఉద్యోగులు మరోసారి బాబుపై గుర్రుగా ఉన్నారట. రాజధాని హడావుడిలో ఉద్యోగులపై ఒత్తిడి తేవటం మరోసారి తప్పునే చేసినట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించటమో లేక సౌకర్యాలు కల్పించటమో చేస్తే కొంతలో కొంతైనా వారు శాంతించే అవకాశం ఉందని చంద్రబాబుకు వారు సూచిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ