పాకిస్థాన్ గురివింద ముషార్రఫ్ పీకల్లోతు కేసుల్లో మునిగితేలుతున్నాడు. పనిలోపనిగా భారత్ పై వీలుచూసుకుని విషం కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఫలానా యుద్ధానికి, ఫలానా విద్రోహా చర్యకీ సూత్రధారిని నేనే అని ప్రకటించుకున్న వైనం మనకు గుర్తే. ఒకటైంలో ఢిల్లీ వచ్చి తన తాతలనాటి ఇల్లు, తను చదువుకున్న బడిలాంటి పాత జ్నాపకాలతో సెంటిమెంటు పండించిన ఈ వగలమారి సైనికుడు మహారాష్ట్రలోని శివసేన పార్టీని టార్గెట్ చేశాడు.
శివసైనికుల్ని ఉగ్రవాదులుగాను, ఆ పార్టీని ఉగ్రవాద పార్టీగాను ప్రకటించేందుకు ఐక్యరాజ్యసమితి స్థాయిలోనైనా పోరాటం చేస్తానంటున్నాడు. భారతీయుల సంస్కారం ప్రతిబింబించే సన్నివేశం గదర్ ఏక్ ప్రేమకథలో ఉంటుంది. హీరోని పాకిస్థాన్ జిందాబాద్ అనమంటే నిస్సంకోచంగా నినదిస్తాడు. హిందుస్థాన్ ముర్దాబాద్ అనమని ఒత్తిడి చేస్తే వారిగడ్డ మీదే ఉండి కూడా పోబే, కుయ్యా అని నిశ్చితంగా నో అంటాడు. నీ ఇంట్లో ఉన్న పాముల్నీ, తేళ్లనీ, బొద్దింకల్నీ ఏంచేయాలో ఆలోచించుకోవయ్యా ముష్కరఫూ!మా ఇంటి సంగతి మేం చూస్కోగలం. గమ్మునుండవయ్యా పెద్దమనిషీ, పెద్దమాటలు కట్టిబెట్టి!
మేరాభారత్ మహామహాన్!