క్షేత్రపాలకులు

September 18, 2015 | 04:34 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Chandra_Babu_Naidu_Thinking_niharonline

చంద్రబాబు అధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం జరిగింది. కొత్త కాపురం, కొత్త రాష్ట్రం అంతా కొత్తకొత్తగా ఉంది. ఆలోచనలు కూడా కొత్తగానే ఉంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రమామ గారి మామయ్యకు కూడా తెలవారు ఝామున ఏదో పథకం అకస్మాత్తుగాగా మెరిసేది. అంతే సెక్రటరీలు పరుగున వచ్చివాలడం, సదరు పథకానికి రూపు రేఖలు దిద్దడం జరుగుతుండేది. కొద్ది రోజుల క్రితం వెంకయ్య గారు కూడా సికింద్రాబాదు సర్దార్ పటేల్ అంటే ఎస్.పి.రోడ్డులో వెళ్తూ ఇంతవరకూ ఎస్ పి రోడ్డు ఉంది. ఇక కలెక్టర్ రోడ్డు కూడా ఉంటే బావుండునని హాస్యమాడేడు. స్వాతంత్ర్యమొచ్చిన తర్వాత మొన్నమొన్నటి వరకు కలెక్టర్ కలెక్టరు అంటే ఎనలేని గౌరవం, మన్నన, గ్లామరు ఉండేది. అసలు కలెక్టర్ని కలవడమంటే అపురూపమనమాట. ఆ వ్యక్తులు కూడా దానికి తగ్గట్టు ప్రవర్తించేవారు. నూటికి కోటికి చిన్న చిన్న రిమార్కులుండేవేమో. కలెక్టరుకి సరైన తెలుగు కనిపెట్టిన దాఖలాలు లేవు. మనవాడు కలెక్టరు తెల్సా అంటే బిల్లుకలెక్టరా అనే జోకులు కూడా వినపడేవి.  మొన్న జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ కలెక్టర్ అనే మాట బ్రిటిష్ వాళ్ల జమానాలోది. బావోలేదు, మార్చేద్దాం అని ప్రకటించడం జరిగింది. కలెక్టరు అంటే కలెక్షనె చేసే వాడని కూడా అనుకోవచ్చు. నిజమే రెవెన్యూ పవర్లు, జుడీషియల్ పవర్లు ఉన్న జిల్లా ఉన్నతాధికారికి సరియైన పేరు కనిపెట్టే శుభసమయమొచ్చింది. ప్రజల అభిప్రాయం, పండితుల అభిప్రాయం సేకరించే ప్రయత్నం జరగాలి. లేక అయ్యేస్సుల ఉద్దేశ్యం కూడా తెల్సుకుని మీ పేరేం పెట్టుకోదలుచుకున్నారు బాబూ అని అడగొచ్చు. ఎర్రసైన్యం సినిమాలో జానకి పాడిన పాటలో నువ్వు కలకటేరూవనుకుంటిరో అని కలెక్టరు మాట అలా పలుకుతుంది. ఆపై మీ ఇష్టం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ