రాజకీయ విచిత్రం: బద్ధ శత్రువులు ఒకటయ్యారు!

March 02, 2016 | 11:09 AM | 3 Views
ప్రింట్ కామెంట్
TDP_congress_tie_up_for_khammam_corporation_election_niharonline

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సన్నాసి అన్న నోటితోనే ‘అన్నా’ అనొచ్చు... పాతికేళ్లుగా ఉంటున్న పార్టీకి గుడ్ బై చెప్పి పనికిమాలినోడు అని పిలిపించుకున్న నోటికి దగ్గరైపోవచ్చు. రాత్రికి బండబూతులు తిట్టి, పొద్దున కండువా కప్పేసుకోవచ్చు. ఏదున్నా ఇక్కడ దుళిపేసుకోవటం కామన్. నేతలు కూడా ఏ టైంలో ఎవరూ ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ చెప్పటం కష్టం. అయితే కాంగ్రెస్ ను పాతరేయడానికే పుట్టినట్టు చెప్పుకొచ్చే టీడీపీ, ఆ పార్టీతోనే దోస్తీ కడితే ఎలా ఉంటుంది. కాంగ్రెస్ దొపిడీలో తెలుగు ప్రజలు దగా పడ్డారని అందుకే పార్టీ పెడుతున్నట్లు నాడు ఎన్టీఆర్ ప్రకటించగా, ఆ నినాదాన్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు అధినేత చంద్రబాబు. మరి అలాంటిది వైరామ్యాలను పక్కనబెట్టి ఈ రెండు ఒకటయ్యాయి, అది కూడా ఖమ్మం కోసం చేతులు కలిపాయి... ఏంటీ విచిత్రం?

                                            తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పాలమూరు జిల్లా అచ్చంపేట మునిసిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ కు ఎదురొడ్డి నిలిచే క్రమంలో అచ్చంపేటలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఇక ఖమ్మంలోనైతే వామపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో వారు విడిపోటీకే ప్రాధాన్యం ఇచ్చారంట. దీంతో అక్కడి కార్పొరేషన్ లో మిగిలిన పార్టీలను పక్కనబెట్టిన కేవలం టీడీపీ, కాంగ్రెస్ లు చేతులు కలిపాయి. రెండు డివిజన్ల(49, 50)లో కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి దింపకుండా, టీడీపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. అందుకు ప్రతిఫలంగా టీడీపీ కూడా రెండు డివిజన్ల (1, 6)లో తన అభ్యర్థులను దింపకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చింది. టీఆర్ఎస్ దెబ్బకి ఏం చేయాలో పాలుపోని ఈ రెండు పార్టీలు ఈ కొత్త మైత్రికి తెరలేపాయి. సైకిల్ కి స్నేహ హస్తం అందించి ముందుకు సాగాలని వీరు చేస్తున్న ప్రయత్నంలో ముందు ముందు మరెన్ని చిత్రాలు చోటుచేసుకుంటాయో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ