ప్రధానిగా నరేంద్ర మోదీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విమర్శలతో విరుచుపడేందుకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఇందుకోసం బుధవారం ఒక్కరోజే 24 ప్రెస్ కాన్ఫరెన్సులను ఏర్పాటు చేసింది. అంతేకాదు ఈ రోజు నుంచి ఆరు రోజులపాటు మోదీ ప్రభుత్వాన్ని ఏకీపడేసేందుకు దాదాపు 100 ప్రెస్ కాన్ఫరెన్స్ లను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం అధికార ప్రతినిధులను నియమించే పనిలో ప్రస్తుతం పార్టీ బిజీగా ఉంది. ఇందులో రాహుల్ నుంచి సీనియర్ నేత చిదంబరం వరకూ దాదాపు అగ్రనేతలంతా ప్రసగించనున్నారు. శ్రీనగర్ లో షకీల్ అహ్మద్, చెన్నైలో మిలింద్ దేవరా కమలనాథుల పనిపట్టే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఏడాది పాలనను గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్న బీజేపీ కి ఇది కాస్త మింగుడు పడని విషయమని అనుకోవచ్చు.