ఏపి కి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాకు నష్టమా?

May 20, 2015 | 11:20 AM | 27 Views
ప్రింట్ కామెంట్
gutta_Sukender reddy_ap spl status_niharonline

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌తో పాటు పార్టీ అధిష్ఠానం డిమాండ్‌ చేస్తుండగా,. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమని, ఇక్కడి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతాయని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలో విన్నవించారు.  వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌కు విభజన తర్వాత కూడా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించలేదని గుత్తా తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే వాదనకు ఎలాంటి బలమైన ప్రాతిపదిక లేదని, ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని, విశాఖ ఉక్కుతో సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలున్నాయని, కృష్ణా, గోదావరి నదుల వల్ల వ్యవసాయరంగంలోనూ ఆంధ్రప్రదేశ్  ముందుందని గుత్తా తన లేఖలో ప్రస్థావించారు. కాగా ఈ విషయమై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆయనకేం నష్టమని ప్రశ్నించారు. ఈ విషయమై రఘువీరా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.  రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సమయంలో యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని రఘవీరా గుర్తుచేశారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ ప్రజలు తిరిగి పార్టీ కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్నారని,  దీనిపై తక్షణం స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని రఘువీరా సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ