కేంద్ర మహిళా మంత్రులపై ఆరోపణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటం కాంగ్రెస్ కు నచ్చటం లేదట. అందుకే ఆరోపణలకు దిగింది. ఈ వ్యవహారంలో మోదీ రాజ్య ధర్మాన్ని కాకుండా రాజె ధర్మాన్ని పాటిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని తప్పని సరిగా రాజ ధర్మం పాటించాలి. అంతేగానీ, రాజేధర్మం లేదా లలిత్ ధర్మాన్ని పాటించకూడదు కదా అని అన్నారు. మరోపక్క రాజకీయ ప్రకంపనలకు మూలధారం అయిన లలిత్ మోదీ ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీపై కామెంట్లు చేశాడు. ప్రధాని మోదీ ఎంతో విషయ పరిజ్ణానం ఉన్న వ్యక్తి అని కొనియాడాడు. ఆయనకు నా సలహా అవసరం లేదు. ఎప్పుడైతే బ్యాటింగ్ కు దిగుతారో, అప్పుడు బంతిని స్టేడియం బయటకు కొడతారని ట్వీట్ చేశాడు. వివాదంతో బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసిన లలిత్ మోదీ ఇలా ప్రధాని మోదీ గురించి పోగటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.