ఢిల్లీలో మరోసారి ‘తారక’ మంత్రం

June 27, 2015 | 02:36 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ktr_about_cash_for_vote_scam_niharonline

ఢిల్లీలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోసారి తారక మంత్రాన్ని జపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే మాట మరోసారి మీడియా ముందు వినిపించారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. భేటీ అనంతరం మీడియా ఆయనను ఓటుకు నోటు వ్యవహారంపై కదిలించింది. ఇక దీనికి ఆయన సమాధానమిస్తూ చట్టం తన పని తాను... అని వ్యాఖ్యానించారు. అంతేకాదు విభజన చట్టంలోని పదో అధికరణ కిందకు వచ్చే సంస్థల నిధులపై ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును నిరస్తూ... ఈ విషయాన్ని జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ చెప్పారు.  ఏపీ సర్కార్ తమకు తెలీకుండా రూ.1270 కోట్లను బదిలీ చేసుకుందని, ఆ నిధులన్నీంటిని తిరిగి ఇప్పించాలని జైట్లని కోరినట్టు తెలిపారు. ఇక కొద్దిరోజుల క్రితం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ అప్పుడు కూడా మీడియాతో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నూతన రాష్ట్రంలో మాకు చాలా పని ఉందని... అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తుందని అప్పుడు ఆయన మీడియాతో అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకున్న పెట్టే కీలక వ్యవహారమయినప్పటికీ పార్టీలోని సీనియర్ నేతలకు కాకుండా నమ్మకంతో కుమారుడైన కేటీఆర్ కు కట్టబెట్టాడు సీఎం కేసీఆర్. దీంతో కేటీఆర్ ఆచీతూచీ వ్యవహారిస్తున్నారనే అర్థమవుతోంది. ఇందులో భాగంగానే కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ