కర్ణాటక లైట్ తీసుకున్నా కరుణా వదలడట

May 25, 2015 | 04:26 PM | 20 Views
ప్రింట్ కామెంట్
Karunanidhi_jaya_lalithaa_DA_case_supreme_court_niharonline

తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు గడవక ముందే ప్రతిపక్ష డీఎంకే జయలలితకు ఊపిరి ఆడకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును డీఎంకే పార్టీ సవాలు చేస్తుందని  అధ్యక్షుడు కరుణానిధి సోమవారం ప్రకటించారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే హక్కు డీఎంకేకు ఉందని సుప్రీంకోర్టు రెండుసార్లు చెప్పిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, కర్ణాటక అడ్వకేట్ జనరల్ రవివర్మ కుమార్ ఇద్దరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వానికి సూచించారు. అయితే కర్ణాటక ఈ విషయాన్ని లైట్ తీసుకుంది. దీంతో తామే కోర్టును ఆశ్రయిస్తామని కరుణానిధి తెలిపారు. మరోవైపు ఈ కేసును ముందుగా ఫైల్ చేసిన అసలు సూత్రధారి , బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి కూడా అప్పీలువైపే మొగ్గు చూపిస్తుననట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో డీఎంకే ప్రధాన కార్యదర్శి అంబళగన్ కూడా ఓ పిటిషనర్ గా ఉన్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ