కేంద్రం ను ఇరకాటంలో పెట్టే ఆప్ ఆయుధం?

May 25, 2015 | 11:34 AM | 24 Views
ప్రింట్ కామెంట్
kejriwal_manish_sisodia_complete_statehood_delhi_niharonline

ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతోంది. అయితే ఈ మూడు నెలల పాలనలో ఆ ప్రభుత్వానికి కేంద్రం చుక్కలు చూపిస్తూనే ఉంది. వరుస విమర్శలతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్ విశిష్ట అధికారాలపై కూడా ఆప్ కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. దీంతో ఇప్పుడు జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఓ మహత్తర ఆయుధాన్ని దొరకబుచ్చుకుంది. అదే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని స్వయంగా ప్రధాని మోదీయే ప్రకటించారు. మరీ అన్న మాటను నిలబెట్టుకోవాలని ఇప్పుడు ఆప్ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోయి మరీ ఇప్పుడు లెఫ్టినెంట్ కు విశిష్ట అధికారాలంటూ కేంద్రం ఢిల్లీపై పెత్తనం చెలాయిస్తుందని ఆప్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కేంద్రంతో జగడంకు సిద్ధమని ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించాడు. అంతేకాదు 100 రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం ర్యాలీ, బహిరంగ సభ, మంగళవారం రోజు ఎమ్మెల్యేలతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారాలన్నీ గవర్నర్ పరిధిలో ఉంటే ఇంక తామెందుకనీ (ఆప్ ప్రభుత్వం) ఆయన అంటున్నారు. కాగా, గత కొంత కాలంగా రాజ్యాంగ పరమైన సమస్యలతో ఢిల్లీలో పాలన కుంటుపడిన సంగతి తెలిసిందే. దీంతో పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశాన్ని తెర మీదకు తేవటం ద్వారా కేంద్రంను ఈజీగా ఇరకాటంలో పెట్టడంతోపాటు, ప్రజాదరణ కూడా పొందవచ్చని ఆప్ భావిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ