దెబ్బకు వణికిపోయి అలాంటి వ్యాఖ్యలు చేశాడంట

June 11, 2015 | 05:18 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Defence_Minister_Manohar Parrikar_ Pakistan_minister_nisar_niharonline

మయన్మార్ వ్యవహారంపై పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసర్ అలీ ఖాన్ స్పందించిన విషయం తెలిసిందే. సరిహద్దులు దాటి తీవ్రవాద శిబిరాలపై దాడులు చేస్తూ ఊరుకునేది లేదని, బెదిరింపులతో లొంగేందుకు తామేం మయన్మార్ కాదని ఆయన భారత్ కు బదులిచ్చారు. దీనిపై భారత్ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. భారత్ చర్యకు భయపడిన వారు మాత్రమే అలా స్పందిస్తారని అన్నారు. పాక్ మంత్రి నిసర్ భారత్ చర్యలకు భయపడే ఉంటారేమో అందుకే ఆయన అలా మాట్లాడారు అని పారికర్ ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో తెలిపారు. కాగా, మయన్మార్ లో భారత సైన్యం జరిపిన దాడి ఇతర దేశాలకు హెచ్చరికలాంటిదని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. దీనిపైనే పాక్ మంత్రి నిసర్ ఆ విధంగా స్పందించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ