ప్రజా సమస్యలను పరిష్కరించటంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా వచ్చే నెల (జూన్ ) 3,4 వ తేదీల్లో మంగళగిరి ప్రాంతంలో సమర దీక్షను చేయనున్నారట. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను, వీడియో ట్రైలర్ ఆ పార్టీ నేతలు పార్థసారథి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం విడుదల చేశారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ దీక్ష ద్వారా చంద్రబాబు, వైఫల్యాలను ఎండగడతామని, మహిళలను, రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశాడో ప్రజలకు వివరిస్తామని తెలియజేశాడు. బాగానే ఉంది కానీ ప్రతిపక్షంగా మీరు చేసే దీక్ష కోసం ఈ రేంజ్ లో పోస్టర్ లు, వీడియో ట్రైలర్ అవసరమా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా లెవెల్లో అంత అవసరం లేదని వారు చురకలు అంటిస్తున్నారు. ఇక అధికార పక్షం టీడీపీ కూడా ఈ తతంగాన్ని లైట్ తీసుకుంది. ఇప్పటిదాకా జగన్ చేసిన ఏ ఒక్క దీక్ష కూడా విజయవంతం కాలేదని, ఇది కూడా మరో ఫ్లాప్ షో అవుతుందని ఎద్దేవా చేస్తున్నారు.