నేరుగా తిట్టలేక ‘నయా నిజాం’ అంటున్నాడు

July 04, 2015 | 12:59 PM | 2 Views
ప్రింట్ కామెంట్
digvijay_singh_KCR_niharonline

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై ప్రతిరోజూ తెలుగు రాష్ట్రాలలో ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉన్నారు. కానీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కాస్త ఢిపరెంట్ గా ఆరోపణాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని... కోట్ల విలువైన కొత్త బస్సులు, హంగామాలు, హంగులతో కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కు కొత్త నిజాంలా కేసీఆర్ తయారయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ జిల్లాలో పర్యటించేందుకు 5 కోట్ల రూపాయల విలువైన బస్సు అవసరమా? అని ప్రశ్నించారు. ముందు ఎన్నికల హామీలను నెరవేర్చాలని సూచించారు. అయితే ఇదంతా ఇటీవల సీనియర్లంతా పార్టీని వీడి పోతుండటంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక, కేసీఆర్ ను నేరుగా తిట్టే విమర్శించే ధైర్యం లేకే దిగ్విజయ్ మాట్లాడుతున్నాడని గులాబీ నేతలు పంచ్ లు వేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ ను ఆ విషయంలో గనుక తగులుకుంటే ఆ సీనియర్లతోనే డిగ్గీరాజాను ఆడుకుంటామని వారంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ