ప్రెసిడెంట్ ను లేపేయాలంటున్న ట్రంప్ పనిమనిషి

May 14, 2016 | 10:29 AM | 4 Views
ప్రింట్ కామెంట్
trum-exbutler-obama-niharonline

ప్రత్యర్థులను విమర్శించడంలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఎంతమాత్రమూ వెనుకడుగు వేయబోరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఒకప్పటి తన యజమానిని మరోసారి మంచి చేసుకుంటే, ఆయనతో పాటు వైట్ హౌస్ లో మకాం వేయవచ్చని అనుకున్నాడో ఏమో... గతంలో ట్రంప్ వద్ద దీర్ఘకాలం పాటు పనిచేసిన ఆంటోనీ సెనెకల్ అనే అతను ఇంకో అడుగు ముందుకేశాడు. ఏకంగా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలకు దిగాడు.

                                         ఒబామా కెన్యా నుంచి వచ్చిన ద్రోహి అని, బాస్టర్డ్ అని, ఆయన్ను ఉరేసి చంపేయాలని ఆరోపణలు చేస్తూ, ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టాడు. అతని వ్యాఖ్యల తీవ్రతపై ఇప్పుడు యూఎస్ సీక్రెట్ సర్వీస్ స్వయంగా రంగంలోకి దిగింది. వీటిపై విచారణను ప్రారంభించింది. ఆంటోనీ సెనెకల్ వ్యాఖ్యలు, ఆయన ఫ్రెండ్స్ కు అక్కడి నుంచి అలా అలా పాకి అమెరికాలో వైరల్ కావడంతో, ప్రస్తుతం వాటిని తొలగించినప్పటికీ, విషయమంతా తమకు తెలిసిందని, విచారణ జరుపుతున్నామని యూఎస్ ఎస్ఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై ట్రంప్ ప్రతినిధి స్పందిస్తూ, ఇంత పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ప్రకటన వెలువరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ