అమరావతి వాసులకు అదిరే ఆఫర్

May 14, 2016 | 10:15 AM | 2 Views
ప్రింట్ కామెంట్
amaravathi_free_treatment_10_years_niharonline

నవ్యాంధ్ర రాజధాని అమ‌రావ‌తి వాసుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఆరోగ్య‌ర‌క్ష క‌ల్పించనుంది. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజ‌ధాని న‌గ‌రంలో నివ‌సించే ప్ర‌జ‌ల‌కు ప‌దేళ్ల‌పాటు ఉచిత వైద్యం అందించ‌నుంది. గ‌త ఏడాది డిసెంబర్‌ 8వ తేదీకి ముందు నుంచి అక్క‌డ నివ‌సిస్తోన్న ప్ర‌జ‌ల‌కు ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేర‌కు ఏపీ మెడిక‌ల్‌ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ పూనం మాల‌కొండ‌య్య  ఉత్త‌ర్వులు జారీ చేశారు. తెలుపు, గులాబీ రంగు రేష‌న్ కార్డులు క‌లిగి ఉన్న రాజ‌ధాని వాసులకు ఎన్టీఆర్ హెల్త్ స‌ర్వీస్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఈ సేవ‌ల‌ను ఉచితంగా పొంద‌చ్చ‌ని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ స‌ర్వీస్ ట్ర‌స్ట్ కు అందించే నిధుల ద్వారా ఈ ప‌థ‌కంతో ఏ చికిత్స‌న‌యినా ప్రభుత్వ, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా పొందవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ