ఇరానీని ఓవర్ యాక్షన్ తగ్గించుకోమన్న బీజేపీ!

February 29, 2016 | 11:21 AM | 1 Views
ప్రింట్ కామెంట్
BJP-warns-smriti-irani-melodrama-speech-niharonline

ఎదుటి పార్టీ చేసే ఆరోపణలు తిప్పి కొట్టేందుకు ‘ఫైర్ బ్రాండ్’ లు పార్టీకి ఖచ్చితంగా అవసరమనేది తెలిసిందే. విషయం ఎంత జఠిలమైనప్పటికీ అవతలివారు చేసే విమర్శలను జూనియర్, సీనియర్ అని తేడా లేకుండా కరెక్ట్ గా సమాధానమిచ్చేది వారే. ఇక బీజేపీలో ఉమాభారతి తర్వాత అలాంటి వారు కరువయ్యారనే చెప్పాలి. రాజకీయ సన్యాసం అంటూ కొన్నాళ్లూ అజ్ణాతంలోకి వెళ్లి, తిరిగి వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆమె హవా కొనసాగటం లేదు. ఆమెకు ప్రత్యామ్నాయం ఎవరు అనుకుంటున్న సమయంలో మోదీ‘అండ’తో వెలుగులోకి వచ్చింది సృతీ ఇరానీ. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ మొదటి నుంచి ఆమె తనదైన శైలిలో సగిపోతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె చేసిన పని పార్టీనే ఇరకాటంలో పడేసేలా చేసింది.

సెంట్రల్ వర్సిటీలో రిసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్ యూ,  తదితర అంశాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై మొన్నామధ్య విరుచుకుపడ్డారు ఆమె. చేతిలో ఓ పాంప్లెట్ ను చేతబట్టుకుని ఆవేశపూరితంగా చేసిన ఉద్వేగభరిత ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ అంశాలతో పార్లమెంట్ సమావేశాలు వ్యర్థం అవుతాయని భావించినప్పటికీ అది జరగకుండా ఆమె తప్పించారు. కీలకంగా మారిన ఈ ప్రసంగంపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెన అభినందించడమే కాకుండా, ఆ లింక్ ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే ఇరానీ ప్రసంగంపై మోదీ సంతృప్తి వ్యక్తం చేసినా, పార్టీ అధిష్ఠానం మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట.

                          ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఆసక్తికర కథనాన్ని రాసింది. ఎన్డీయే ప్రభుత్వాన్నే కాక బీజేపీని ఇరుకునపెట్టిన ప్రసంగంపై వివరణ కొరింది. ఇలాంటి ‘మెలోడ్రామా’ ప్రసంగాలు ఇకపై వద్దంటూ ఆమెకు కాస్తంత గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ఆయా విషయాలపై సభలో మాట్లాడే ముందు పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీతో చర్చించాలని కూడా ఆమెకు ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ