గులాబీ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ కొట్టేసుకున్నారు

February 27, 2016 | 04:25 PM | 1 Views
ప్రింట్ కామెంట్
baji-reddy-goverdhan-Bhupathy-reddy-clash-niharonline

పార్టీలో ఇప్పటిదాకా లేదనుకున్న ముసలం టీఆర్ఎస్ లో మొదలైందా? నిజామాబాద్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య తలెత్తిన వివాదం తీవ్రమైనదేనా?. అసలేం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఫ్లెక్సీ ఏర్పాటులో ఫోటోలు లేకపోవటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ వర్గీయులు కొట్టేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మధ్యలో వారిద్దరి ఒకరిపైకి ఒకరు రావటం విశేషం.

                        శనివారం నిజామాబాద్ జిల్లాలో ఐకేపీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఫోటో లేదు. ఇది గమనించిన భూపతి అనుచరుడు, జిల్లా మండలాధ్యక్షుడైన వెంకట్ ఫోటో విషయంపై బాజిరెడ్డిని అక్కడికక్కడే నిలదీశారు.

                            ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో ఉన్నట్టుండి వెంకట్ పై ఎమ్మెల్యే బాజిరెడ్డి చేయిచేసుకున్నారు. దాంతో ఆగ్రహించిన భూపతిరెడ్డి బాజిరెడ్డిపైకి వెళ్లారు. ఇదే సమయంలో ఇద్దరి అనుచరులు, పార్టీ కార్యకర్తలు కూడా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో మండలాధ్యక్షుడు వెంకట్ కు రక్తం వచ్చేలా దెబ్బలు తగిలాయి. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని అడ్డుకుని శాంతింపజేయడంతో గొడవ సర్దుమణిగింది. ఇష్యూ చిన్నదైనప్పటికీ గులాబీ బాస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ