న్యాయదేవత కళ్లకి గంతలెందుకు!

July 27, 2015 | 04:39 PM | 5 Views
ప్రింట్ కామెంట్
yakub_memon_raw_officer_salman_khan_death_sentence_hang_Nagpur_jail_niharonline

పాత దేవానంద్ సినిమాలో జానీ వాకర్ కి రఫీ పాడిన యహ్ బొంబాయ్ మేరీజాన్ వింటే ఆ నగరం అంటే అక్కడి వారికి ఎంత ఇష్టమో భారతీయులందరికీ బోధపడ్తుంది. అలాంటి బొంబాయి గుండెల మీద రక్తం చిందించారు. టైగర్ మెమన్ కంపెనీ దారుణం జరిగినప్పుడు దానికి కారణభూతులుండి తీరతారు. వారిని గుర్తించే విభాగాలు బోల్డెంత ఖర్చుతో నడుస్తుంటాయి. భజిరంగి బాయ్ జాన్ లాంటి ఒద్దికయిన సినిమా చాలా రోజుల తర్వాత వచ్చిందని ప్రేక్షకులు లొట్టలేస్తుంటే సల్మాన్ అంతర్మాత ప్రబోధితుడై ఒక ప్రకటన చేశాడు. ఈ మెమన్ ని కాదు, వీడి భాయ్ జాన్ ఒకడున్నాడు. వాడే అసలు కిలాడి. వాడ్ని ఉరితీసి పెట్టండని అభ్యర్థించాడు. అంతే దేశంలో ఒక్క కుదుపు, ముందుగా బీజేపీ కార్యకర్తలు సల్లూ భాయ్ ఇంటి ముందు వాలిపోయి ఆందోళన చేశారు. సినిమా వాళ్లు, రాజకీయ నటులు గొంతు విప్పేరు. ఇదంతా ఒక ఎత్తు... రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ అధికారి వెల్లడించిన అభిప్రాయం గమనించవల్సిందే. తనంతట తానుగా లొంగిపోదామని వచ్చిన మెమన్ ఓ పెద్దమనిషి సలహా మేరకు తిరుగుదారి పడుతుంటే నేపాల్ పోలీసులకు దొరికి అక్కడి నుంచి ఇండియా జైలుకు చేరాడు. ఇక ఉరిశిక్ష పైనే దృష్టిపెట్టిన ప్రాసిక్యూషన్ శిక్ష తగ్గించే అవకాశాలున్న కోణాల్ని సృశించలేదు. ఇరవై ఏళ్లుగా జైలు జీవితం గడిపిన మెమన్ కు ఇప్పుడు ఉరివేయడం-కరెక్ట్ టైమేనా? మరో ఇరవై రోజులు ఆగి అప్పుడు వేసే ఆలోచన చేయొచ్చుగా ధర్మదేవత! జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ