కోల్ కుంభకోణంతో నాకేం సంబంధం లేదు

June 30, 2015 | 06:03 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Dasari_Narayana_Rao_about_coal_scam_niharonline

బొగ్గు కుంభకోణం పై దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం బొగ్గు శాఖ సహాయమంత్రిగానే పనిచేశానని, శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగే తీసుకునే వారని చెప్పారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల దగ్గర నుంచి అన్ని నిర్ణయాలు కూడా మన్మోహనే తీసుకునే వారని దాసరి తెలిపారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించటమే తప్ప, తాను ఏనాడూ సొంత నిర్ణయాలు తీసుకోలేదని ఆయన వెల్లడించారు. కుంభకోణంతో తనకు ఏ సంబంధం లేదని స్పష్టంచేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ