శివసేన గాండ్రింపు : ఆ సోదరులిద్దరు రాక్షసులట

April 22, 2015 | 01:11 PM | 34 Views
ప్రింట్ కామెంట్
shiva_sena_fires_on_MIM_leaders_niharonline

ముస్లింల ఓటింగ్ హక్కులు ఉపసంహరించాలంటూ కొన్ని రోజుల ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన తాజాగా ఎంఐఎం పార్టీ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలను లక్ష్యం చేసుకుంది. దేశానికి పెద్ద ప్రమాదకరమైన ఆ సోదరులిద్దరూ రాక్షసులు అంటూ పేర్కొంది. పార్టీ పత్రిక సామ్నాలో బుధవారం ప్రచురితమైన సంపాదకీయంలో ఈ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసింది. గురువారం ముంబైలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ఈ సోదరులిద్దరూ మతం రంగు పులమాలనుకుంటున్నారని ఆరోపించింది. వారిద్దరూ పాకిస్థాన్ అనుకూల వ్యక్తులంటూ సంపాదకీయంలో పేర్కొన్న సేన... దేశానికి వారేమి చేయలేరని, ఔరంగబాద్, నవీ ముంబై లో పొరుగు దేశ జెండాను ఎగరవేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తింది. ఇటీవల బాంద్రా ఈస్ట్ నియోజకవర్గంలో ఎంఐఎం ఓటమిపాలైన నేపథ్యంలో దాన్నుంచైనా ఒవైసీ సోదరులు పాఠం నేర్చుకోవాలని సేన సూచించింది. కాగా సేన, బీజేపీ కూటమి ఈ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ