ఆయన ఓ మాజీ సెనేటర్. వయస్సు 90 ఏళ్లు. 20 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. ఇన్నాళ్లు ఒంటరి జీవితం గడిపారు. అయితే ఇప్పుడు ఆయనకు లైఫ్ బోర్ కొట్టిందట. ఓ తోడు ఉండాలని కొరుకుంటున్నాడు, మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. ట్విస్ట్ ఏంటంటే... ఆయన చేసుకోబోయేది మహిళను కాదు. ఓ 40 ఏళ్ల వ్యక్తిని ఆయన పెళ్లి చేసుకోబోయేది. అమెరికాలోని పెన్సిల్వేనియా మాజీ సెనేటర్ హారిస్ వొఫోర్డ్. చనిపోవడంతో 20 ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతోన్న హారిస్ వొఫోర్డ్ తన భార్య మరణాంతరం ఫ్లోరిడాలో మాథ్యూ కార్ల్‌టన్ అనే యువకుడిని కలిశాడు. మాథ్యూ కార్ల్‌టన్‌తో 15 ఏళ్లుగా స్నేహాన్ని కొనసాగిస్తోన్న హారిస్ వొఫోర్డ్ ఇప్పుడు అతనిని వివాహమాడనున్నాడు. తన భార్య తరువాత తనను ప్రేమించే వ్యక్తిగా మాథ్యూ(40)ను చూస్తున్నానని చెప్పాడు. సమాజం ఈ విషయంపై ఏమనుకున్నా సరే మాథ్యూను పెళ్లి చేసుకుంటానని సంతోషంగా చెబుతున్నాడు ఈ వృద్ధ పెళ్లికొడుకు!