కరప్షన్ సిరీస్ లో మరో పుసక్తం

April 26, 2016 | 12:00 PM | 1 Views
ప్రింట్ కామెంట్
jagan-released-emperor-of-corruption-niharonline

తెలుగు రాజకీయాల్లో అవినీతి కుంభకోణాలంటూ మరో పుస్తకం విడుదలైపోయింది. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరిట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి చేశారంటూ అంటూ ప్రతిపక్షనేత జగన్ ఓ పుస్తకం విడుదల చేశారు. టీడీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’కు చెక్ పెట్టేందుకు జగన్ ఏకంగా ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట ఉద్యమం చేపడుతూ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. అక్కడ జాతీయ నేతలను వరుసబెట్టి కలుస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కునేందుకు చంద్రబాబు తన అక్రమ సంపాదననే వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మంత్రి పదవులను కూడా ఎరవేస్తూ తమ పార్టీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని విమర్శించారు. ఇక సేవ్ డెమోక్రసీ ఉద్యమంలో భాగంగా తాము కలిసే జాతీయ నాయకులకు ఈ బుక్కును ఆయన అందజేస్తారంట.

గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతి అక్రమాలపై ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు ‘రాజా ఆఫ్ కరప్షన్’ పేరిట రూపొందించిన ప్రత్యేక బుక్కును ఢిల్లీలో విడుదల చేశారు. ఇక ఇఫ్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగా... వైఎస్ కుమారుడు విపక్ష నేత హోదాలో పుస్తకాన్ని విడుదల చేయటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ