ఎక్కడ సన్నీలియోన్ ఎక్కడ జీహెచ్ ఎంసీ అనుకుంటున్నారా? వారు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే కదా. రైల్వే, ఐబీ. పోలీస్, రక్షణ ఇలా కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్లన్నింటినే మాయ చేసిన కేటుగాళ్లు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సైట్‌పై ఫోకస్ చేశారు. చెత్తను తరలించే వాహనాల రాకపోకలను గమనించేందుకు ఓఎస్‌ఆర్టీ పేజీని జీహెచ్ఎంసీ ఉపయోగిస్తుంది.
సోమవారం ఉదయం యథావిధిగా ఈ పేజీ ఓపెన్ చేయగానే అక్కడ సన్నీలియోన్ న్యూడ్ ఫోటో దర్శనమిచ్చిందట. దీంతో షాక్ కావడం అధికారుల వంతైంది. వెంటనే టెక్నికల్ టీంకు సమాచారం చేరవేయటం, ఆపై వారు దాన్ని తొలగించడం చకాచకా జరిగిపోయింది. ఎవరో ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఈ పనికి పాల్పడని ఉంటారనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తంచేస్తున్నారు. ఆకతాయిల పనితనంతో కాసేపు జీహెచ్ఎంసీ అధికారులంతా తలలు పట్టుకోవాల్సి వచ్చిందట. కాగా, వెబ్‌సైట్‌లో సన్నీ లియోని నగ్న చిత్రం ప్రత్యక్షం మవడంపై సైఫాబాద్ పోలీసులను వివరణ కోరగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని చెప్పారు.