మంత్రి వర్గం మార్పు దేనికి సంకేతం?

April 25, 2016 | 10:53 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Telangana CM KCR ready to cabinet reshuffle

తెలంగాణ కొత్త రాష్ట్రం లో తొలి ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాలనను పూర్తి చేసుకునేందుకు టైం దగ్గర పడింది. ఈ రెండేళ్లలో పాలనా పరంగా ఎటువంటి విమర్శలు రానప్పటికీ, మంత్రులు అంత భేషుగ్గా ఏం పనిచేయలేదనేది కూడా నిజం. ఒకరిద్దరు మినహాయించి మిగతావారెవ్వరూ సీఎం కేసీఆర్ అంచనాలను అందుకోలేకపోయారు. ఆ మధ్య మంత్రివర్గ సమూల ప్రక్షాళన కోసం జాబితాను సిద్ధం చేసినప్పటికీ గ్రేటర్ ఎన్నికలు హడావుడితో కాస్త వెనక్కితగ్గారు. ఇక ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో దానిని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం గవర్నర్ కలిసి అల్రెడీ సమావేశం జరిపిన ఆయన ఈ రెండు మూడు రోజుల్లో దీనిపై ఓ ప్రకటన చేయనున్నారంట.

                               ఇప్పటికే మంత్రులుగా కొనసాగుతున్న వారి విషయంలో పూర్తి అసంతృప్తిగా ఉన్న ఆయన శాఖలను సమూలంగా మార్పు చేయటం పక్కాగా కనిపిస్తుంది.  అయితే కేబినెట్ లోకి ఇటీవల చేరిన వారితోపాటు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి బెర్తులు దక్కుతాయా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఏ మంత్రికి ఏ శాఖ దక్కుతుందోనన్న అంశంపై నేతల్లో సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే పూర్తిగా కొత్త నీరుతో నింపే ప్రసక్తి ఎంత మాత్రం ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ