వెధవ పనిని వెనకేసుకొచ్చే పనిలో గోవా సీఎం

April 06, 2015 | 05:48 PM | 67 Views
ప్రింట్ కామెంట్
Goa_CM_supports_fabindia_niharonline

ఫ్యాబ్ ఇండియాను వెనకేసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీ కాంత్ పర్సేకర్ కూడా అందులో ఒకరు కావటం విశేషం. ట్రయల్ రూంలో కెమెరా ఉండటం వెనుక సంస్థ ప్రమేయం ఏ ఉండకపోవచ్చునని ఆయన అంటున్నారు. ఫ్యాబ్ ఇండియా పెద్ద సంస్థ. దేశ వ్యాప్తంగా పేరున్న అలాంటి సంస్థ ఇలాంటి ఛీఫ్ ట్రిక్స్ ప్లే చేయదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి స్మ్రుతీ ఇరానీ ట్రయల్ రూంలో కెమెరాను గుర్తించి, వెలికి తీయించిన సంగతి తెలిసిందే. భద్రత కోసం ఏర్పాటు చేసిన కెమెరాలో ట్రయల్ రూం ద్రుశ్యాలు పొరపాటున రికార్టయ్యాయని సంస్థ బుకాయించేందుకు ప్రయత్నించింది. అంతేకాదు బెయిల్ కోసం కోర్టులో నిందితులు కూడా ఇదే వాదన వినిపించారు. ఇక ఇప్పుడు సాక్షాత్తూ గోవా ముఖ్యమంత్రి కూడా వారి వాదనకు నిలపడం విచిత్రం. పొరపాటుగా రికార్డు చేస్తే అది తప్పు కాదు అనేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగా పొరపాటుగా తప్పు చేస్తే అది శిక్షార్హం కాకుండా పోతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ