షాక్: ఉద్యమంలో రేప్ లు నిజమేనంట!

April 12, 2016 | 10:55 AM | 2 Views
ప్రింట్ కామెంట్
jat-protest-rapes-haryana-govt-admits-niharonline

హర్యానా ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేయటంతోపాటు,  యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసే విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యమాల ముసుగులో జరిగిన దాష్టీకాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. తమను బీసీల్లో చేర్చాలని జాట్ లు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కి నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. క్రమంగా అది హింసకు దారితీయటం, అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులకు తల నొప్పిగా మారటం తెలిసిందే. అదే సమయంలో ముర్తాల్ ప్రాంతంలో సామూహిక అత్యాచారాలు జరిగినట్లు అప్పట్లో వార్తలు రాగా, ప్రభుత్వం వాటిని ఖండించింది. కానీ, ఇప్పడు అది వాస్తవమేనని హర్యానా ప్రభుత్వం అంగీకరించింది.

అత్యాచారాలపై గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ, అప్పట్లో ఖండించిన ప్రభుత్వం, ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయడం, వారిలో ఇద్దరు తమకు జరిగిన అన్యాయాన్ని వివరంగా చెబుతూ లేఖలు రాయడంతో కేసులోని తీవ్రతను గమనించిన పోలీసులు అత్యాచార ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఢిల్లీకి సమీపంలోని ముర్తాల్ ప్రాంతంలో తమను రోడ్ల పక్కకు ఈడ్చుకు వెళ్లి నిర్దయగా అత్యాచారాలు చేశారని, వీరు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అత్యాచారాలు జరిగాయని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా వెల్లడించారు. తూర్పు ఢిల్లీకి చెందిన యువతి స్టేట్ మెంట్ ఆడియో రికార్డు తన వద్ద ఉందని అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రవాస భారతీయురాలు, తనను రేప్ చేశారని తెలుపుతూ హర్యానా పోలీసు ఉన్నతాధికారులకు రాసిన ఓ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 21వ తేదీన తాను ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగానని, ఒకటో నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వేళ, తన వాహనాన్ని ఆపి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారని ఆమె తెలిపింది. మరో యువతి ఫరీదాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, హాస్టల్ లో ఉంటున్న తాను, జాతీయ రహదారిని దాటుతుంటే బలవంతంగా లాక్కుపోయారని ఆరోపించింది.

ఈ ఫిర్యాదులన్నింటిపై విచారించేందుకు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసినట్టు సౌత్ రేంజ్ ఐజీపీ మమతా సింగ్ వెల్లడించారు. ఈ మేరకు పాత ఎఫ్ఐఆర్ కు ఐపీసీ సెక్షన్ 376 (డీ - గ్యాంగ్ రేప్)ను జత చేసినట్టు తెలిపారు. కాగా, అప్పట్లో కనీసం 10 మంది యువతులపై జాట్ నిరసనకారులు సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్టు కథనాలు వెలువడ్డాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ