ఎంపీ గవర్నర్ కు ఊరట... అరెస్ట్ పై స్టే

April 17, 2015 | 01:23 PM | 63 Views
ప్రింట్ కామెంట్
ram_naresh_yadav_arrest_stay_niharonline

ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) పరీక్షలు, నియామకాల కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయన అరెస్ట్ పై స్టే ఇస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ స్కాంలో ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ గవర్నర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న తనపై చర్యలు తీసుకునేందుకు వీలుండదని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ఎంపీపీఈబీ నిర్వహించిన పరీక్షల నియామకాల్లో నలుగురు విద్యార్థుల పేర్లను గవర్నర్ నరేశ్ యాదవ్ సిఫారసు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న గవర్నర్ కుమారుడు గత నెలలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ