జమ్ములో కరుడు గట్టిన వేర్పాటువాది మసరత్ ఆలం శ్రీనగర్ లో నిర్వహించిన ర్యాలీ పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మసరత్ మద్దతుదారులు పాకిస్థాన్ జెండాలతో భారత వ్యతిరేక నినాదాలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రం తరపున ఆయన జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయిద్ ను ఆదేశించారు. ‘‘దేశ భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని, రాజకీయాలు వేరు భద్రతాంశాలు వేరు. ఈ తరహా ఘటనలకు సహించబోం’’ అని ఆయన హెచ్చరించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.