ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా అక్టోబర్ 2న ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, ఒకే ర్యాంక్ – ఒకే ఫించను అమలుపై ఆయన ఆమరణ దీక్ష చేపడతారట. రైతుల అనుమతితోనే భూసేకరణ జరపాలని, వాళ్ల పర్మిషన్ లేకుండా భూములపై పడితే సహించేది లేదని అన్నా హెచ్చరిస్తున్నారు. అనుమతితోనే భూసేకరణ అనే క్లాజును చేరిస్తేనే దీక్ష విరమణ చేస్తానని ఆయన చెబుతున్నారు. కాగా, గతంలో యూపీఏ హయాంలో జన లోక్ పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఆయన, ఇఫ్పుడిలా మరో ప్రజా ఉద్యమం కోసం మరోక్కసారి చేపట్టడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి మోదీ ప్రభుత్వం ఈ అహింసా వాదిని ఎలా ఎదుర్కొబోతుందో వేచి చూడాలి.