నిధుల లేమితో సతమతమవుతున్న సామాన్య పార్టీ

July 15, 2015 | 12:50 PM | 11 Views
ప్రింట్ కామెంట్
kejriwal_asking_for_donations_niharonline

దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో సంచలన విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. సొంత వారనుకున్న వారంతా పార్టీని ఒక్కొక్కరుగా వీడుతుంటే చెక్కుచెదరని ధైర్యంతో ముందుకు సాగారు కేజ్రీవాల్.  ఫలితం అఖండ విజయంతో ఆప్ ఘనవిజయం. మోదీ హవాను తట్టుకుని మరీ విజయదుంధుబి మోగించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి... తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ తీరు ఎలా ఉంది? ప్రజల్లో ఈ పార్టీ ఇమేజ్ పెరిగిందా తరిగిందా? అత్యంత సంచలనాత్మక విజయం సాధించిన ఈ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో బేరీజు వేసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. పార్టీకి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిందా పెరిగిందా? అనేది అంతుబట్టని విషయంగానే మారింది. ప్రస్తుతానికి ఎలాంటి ఎన్నికలూ లేవు.. ఆప్  పట్ల ప్రజాతీర్పు వచ్చేదీ లేదు.. కాబట్టి ఆ పార్టీ కి ప్రస్తుతం ఉన్న ఇమేజ్ అంతుబట్టనిదిగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీద అరుపులు అరుస్తోంది. ఖజానా ఖాళీ అయిపోయిందని.. దాతలు ముందుకు రావాలని.. విరాళాలు ఇవ్వాలని.. ఆర్థికంగా సత్తువ అందించాలని కేజ్రీవాల్ కోరుతున్నాడు. మరి ఆప్ కు ఇలా డబ్బుల కొరత రావడం కొత్త కాదు. దాని ప్రస్థానంలో ఇప్పటికే పలు మార్లు ఇలా జరిగింది. తాము అధికారంలో ఉన్నా విరాళాలు అడుగుతున్నామని.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం లేదని..ఇలా విరాళాలు అడగడమే తమ నిజాయితీకి నిదర్శనం అని కూడా కేజ్రీవాల్ చెప్పుకొంటూ ఉన్నాడు. మరి ఆప్ అధినేత ఇలా చెబుతున్నప్పటికీ.. విమర్శకులు మాత్రం మండి పడుతున్నారు. ఆప్ పై జనాలకు నమ్మకం పోయిందని. .అందుకే దానికి విరాళాలు రావడం లేదని.. ఆప్ కు క్రేజ్ ఉన్న రోజుల్లో విరాళాలు బాగా వచ్చాయని..  కేజ్రీవాల్ పార్టీ అసలు రూపం అర్థమయ్యే సరికి ఇప్పుడు ఆ పార్టీకి విరాళాలు రావడం లేదని.. వారు అంటున్నారు. అవినీతి ఆరోపణలతోపాటు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదర్కుంటున్న ఆప్ కి గత వైభవం తిరిగి రావటం కష్టమనే చెప్పాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ