హిందూ అతి వాదులనే మాట ప్రాచుర్యం పొందుతూండగా సిరాబుడ్లు పొందగి పొరలి బుస్సు మంటున్నాయి. మొన్నటికి మొన్న సుధీంద్ర కులకర్ణికి సిరా చుక్కలతో మేకప్ సన్మనం జరిగింది. నిన్నటికి నిన్న షేక్ రషీద్ భాయ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అతివాద హిందువుల ధాష్ఠీకానికి గురవ్వడం ఆహ్వానించదగిందిగా లేదు. రషీద్ భాయ్ పై అంతకు ముందే కాశ్మీర్ అసెంబీలలో బీజేసి ఎమ్మెల్యేలు చెయ్యి చేసుకున్నారు. ఇప్పుడేమో ఇంకూ ఇంజనాయిలూ కలగలిపి ముఖంమంతా పూశారు. ఆయన గోమాంసపు విందు ఇచ్చిన తరుణంలో ఈ సన్మాన కార్యక్రమం చోటు చేసుకుంది. సిరా తేరగా వచ్చిందని దుర్వినియోగం చేయడం ఏమియూ సబబుగా లేదని రైటర్ తో సహా అందరూ ఖండించారు. చివరికి చిలికి చిలికి మతకలహాలకు దారి తీసేందుకు వస్తేగానీ నెత్తినోరు బాదుకున్నా ప్రయోజనం ఉండబోదు. మొగ్గలోనే త్రుంచకపోతే సిరాజుద్దీన్ ల స్థానంలో యాసిడుద్దీన్ లు రాగలరు జాగ్రత్త !