దసరా కానుకగా తమిళనాడు వాసులకు ముఖ్యమంత్రి జయలలిత ఒక ప్రకటన చేశారు. అదేంటంటే... ఇక్కడి ప్రజలకు సహకార సంఘాల ద్వారా కేవలం రూ. 110కే ఒక కిలో కందిపప్పు అందిస్తామని ప్రకటించి తారాస్థాయికి చేరిన కందిపప్పు ధరల నుంచి ఉపశమనం కల్పించారు. గత 2-3 నెలలలో చూస్తే, కందిపప్పు ధర కేవలం రూ. 80 నుండి 100 ప్రతి కిలో ఉండగా, ఒక్కసారిగా ధర పెరిగి రూ. 160 నుండి 200లకు చేరింది.
పెరిగిన కందిపప్పు ధరలతో తమిళనాడులోని హోటళ్లలో ఒక ఇడ్లీయే కాదు ఇతర అన్ని రకాల అల్పాహార భోజన ధరలను సైతం పెంచేయడం జరిగింది.
తమిళనాడులోని పప్పు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జయ కేంద్రానికి తెలియజేయడం జరిగింది. దీనితో ఏకీభవించిన కేంద్రం అరకిలో కందిపప్పు ప్యాకేట్ కేవలం రూ. 55కు, కిలో రూ. 110కి అందించనున్నామని వివరించారు. అంతేకాదు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వీలుగా రాష్ర్టవ్యాప్తంగా 91 సహకార స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.