కేజ్రీవాల్ పై మాజీ సీఎం సెక్సీ కామెంట్లు

May 03, 2016 | 02:08 PM | 2 Views
ప్రింట్ కామెంట్
lalu-comments-on-kejriwal-hug-niharonline

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఊహించని పంచ్ పడింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో సోనియా గాంధీని అరెస్ట్ చేయాలని కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీ అతి చేస్తున్నారని కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేసిన లాలూ కేజ్రీ తీరుపై విస్మయం వ్యక్తం చేశారు.

                  నిజానికి లాలూ విరుచుకుపడటానికి అసలు కారణం వేరే ఉంది. అసలు విషయమేమిటంటే బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా కేజ్రీని లాలూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు నాడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవినీతిపరుడైన లాలూతో ఆ ఆలింగనాలేంటని నెటిజన్లు కేజ్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విమర్శలను తప్పించుకునే క్రమంలో కేజ్రీ లాలూ ప్రసాద్ యాదవే తనను బలవంతంగా తన దగ్గరకు లాక్కుని ఆలింగనం చేసుకున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై మీడియా లాలూని ఇప్పుడు ప్రశ్నించగా, ‘‘బలవంతంగా లాక్కుని కౌగిలించుకోవడానికి కేజ్రీ ఏమైనా హీరోయినా?’’ అని లాలూ వ్యాఖ్యానించడంతో అక్కడి మీడియా ప్రతినిధులు నివ్వెరపోయారు. ఇన్నాళ్లు మిత్రపక్షంగా భావిస్తున్న ఆర్జేడీ నుంచి బహుశా ఇలాంటి పంచ్ పడుతుందని కేజ్రీ ఊహించి ఉండరు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ