దేశ రాజకీయాలను మలుపు తిప్పేందుకు చేసే ప్రయత్నాల్లో ఓ అడుగు ముందుకు పడింది. గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కీలకమైన జనతా పరివార్ కూటమి ఆవిర్భవించింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు నిర్ణయించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నివాసంలో ఆదివారం దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో వారు ఈ నిర్ణయాకికి వచ్చారు. సీట్ల పంపకాల విషయమై ఆరుగురితో కూడిన ప్యానెల్ ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే, ఇంతకాలం సందిగ్థతకు కారణమైన సీఎం అభ్యర్థి విషయంలో మాత్రం అనిశ్చితి తొలగలేదు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలటంతో లాలూకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదన్న విషయం తెలిసిందే. అయితే జేడీయూ కే సీఎం పదవిని అప్పజెప్పేందుకు లాలూ సుముఖంగా లేడని విషయం మాత్రం స్పష్టంగా అర్థమౌతోంది. మరి కీలకమైన ఈ విషయంలో భవిష్యత్ లో వివాదాలు తలెత్తకుండా ఉండగలదా?