ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. చాలా కాలంగా ఇరు దేశాల మధ్య నలుగుతున్న సరిహద్దు సమస్యలతో పాటు కొత్తగా ఆ దేశంతో వర్తకవాణిజ్య సంబంధాల గురించి చర్చించేందుకు మోదీ ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ కంటే ముందుగానే అక్కడ వాలిపోయారు. వాస్తవానికి వీరిద్దరూ కలిసి బంగ్లాదేశ్ పర్యటనలో పాల్గొంటారని అంతా భావించారు. అయితే శుక్రవారం రాత్రే ఆమె ఢాకా చేరుకోవటంతో పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఢాకా నగర వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మోదీ లతోపాటు దీదీ (మమతా బెనర్జీ) కటౌట్లు కూడా దర్శనమివ్వటంతో ఆమెకు అక్కడ కూడా క్రేజ్ ఉందనే విషయం స్పష్టమౌతుంది. మొత్తం మీద పర్యటనలోనే కాదు ఆతిథ్య మర్యాదలు అందుకోవటంలో కూడా మోదీ కంటే మమతానే ముందుంది.