మహాత్మునిపైనా, లాల్ బహదూర్ పైనా ఎవరూ సాధారణంగా వేలెత్తి చూపలేరు. నెహూ విషయంలో నైనా కొంత పక్షపాతం ప్రదర్శించేడనే అపవాదులున్నాయి.
మిగతావారిలో గుల్బోరీలాల్ నందా ప్రభుతులు మర్యాద దక్కించుకున్నవారిలో గణనీయులు. వారి పేర్లు ఉచ్ఛరించడానికి చాలామంది బుద్ధి జీవులు జంకుతారు.
వైకాపా కార్యాలయంలో నెలకొన్న గాంధీజీ, శాస్ర్తీజీల పవిత్ర చిత్రపటాలకు జగమ్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించేరని తెలిసింది.
అర్పించిన తదనంతరం సందేశం ఒకటి ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తించినవాడయి ఆ చురుకైన నాయకుడు ఒక సందేశం సంధిచేరు. అది చాలమంది సున్నితమనస్కులకు సూటిగా తగిలినట్టు అనుకుంటున్నారు. సందేశం - "ఆ మహనీయులు అనుసరించిన మార్గం ఆచరణీయం”! మంచిదే!