మాజీ జస్టీస్ చంద్రకుమార్ ఇటీవల తన సహచరులతో కలిసి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి కడిగి, ఉతికి ఆరేస్తున్నాడు. శుభ పరిణామం!
రాష్ర్టంలో ఒక రోజు లంచాలు తీసుకోడానికి బ్రేక్ ఇస్తే ఆరూపేణా ఆదా అయ్యే పైకంతో రైతన్న తాలూకు సమస్త రుణాలు తీర్చేయవచ్చు అన్నారు. రాష్ర్టంలో లంచాల మాటే ఇలా ఉంటే దేశం మొత్తానికి ఇది అన్వయిస్తే ప్రపంచ బ్యాంకు వారివీ, విదేశీ రుణాలున్నూ చిటికెల్లో తీర్చేయగలం.
దేశపురోభివృద్ధికి లంచావతారాల వధ ఇతోధికంగా దోహదపడగలదు.
భూగోళం మీద శక్తివంతమైన రాజ్యంగా అవతరించగలదు. మిగులు లంచధనాన్ని అప్పు పెట్టగలం. కమలహాసన్ సినిమా భారతీయుడుని మళ్లీ రిలీజ్ చేస్తే ఒక్క ప్రేక్షకుడు కూడా లేక ధియేటర్లు దివాళాతీయగలవు. ఈ ఊహాచిత్రం మనదేశంలో ఎప్పటికైనా నిజమవ్వగలదా? నీతి, నిజాయితీలను కవల పిల్లల్ని ఇంటింటా భరతమాత కని ప్రసాదించును గాక! లంచాసుర వధ జరుగు గాక! ఇది మన ఇంటి ఆడపడుచు సత్యభామ వలనే సంభవించు గాక!