పలు కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చుట్టు మరో వివాదం ముసురుతోంది. ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న జగదీష్ టైట్లర్ కు క్లీన్ చీట్ రావటం వెనక మన్మోహన్ సింగ్ హస్తముందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నౌకా దళ రహస్యాలను బయటకు వెల్లడించిన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మ సీబీఐ విచారణలో ఈ విషయాలను వెల్లడించాట. ఈ వివరాలన్నింటీని పొందుపరిచిన నివేదికను ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కు సీబీఐ అందజేసింది. దీనిపై విచారణ జరిపి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. కాగా, టైట్లర్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదర్కొన్న సాక్షి గతంలోనే మరణించినందున, ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయటం ప్రస్తుతం సాధ్యం కాదని సీబీఐ పేర్కొంది.